మహాత్ముల విగ్రహాలు నాయకుల ఫ్లెక్సీలకు ఆధారమా!

  • భారీ సైజు ఫ్లెక్స్ పై ప్రింటింగ్ పై నియంత్రణ అవసరం.
  • నిర్ధుష్టమైన స్థలములో ప్రదర్శించుకోవాలి.
  • స్వీయ నియంత్రణ ఆవశ్యకము.

మహాత్ముల విగ్రహాలు నాయకుల ఫ్లెక్సీలకు ఆధారమా! కొన్ని రోజులుగా నగరంలోని పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. నగరం నడిబొడ్డునే కాదు, శివారు ప్రాంతాలు సైతం చెట్లు కనుమరుగై ఫ్లెక్స్ తో నిండిపోతున్నాయి. పర్యావరణమునకు హాని కలిగించే ఫ్లెక్స్ ప్రింట్స్ పై అవగాహ, స్వీయ నియంత్రణ చేపట్టాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దేశం కోసం, ప్రజల కోసం తమ జీవితాలను తృణప్రాయంగా భావించిన త్యాగధనులు, నాయకుల విగ్రహాలను నగరంలో ప్రధాన కూడళ్ల వద్ద ప్రతిష్ఠించి వారి చరితను భావితరాలకు తెలియచెప్పే విధముగా చేస్తున్న కృషి కొందరి అత్యుత్సాహ కారణాలతో వ్యర్థమైపోవుచున్నది. బూడిదలో పోసిన పన్నీరగుచున్నది. ఈ కొందరి కారణం వల్ల జాతీయభావాలున్న వారి కళ్లలో కన్నీరే మిగులుచున్నది.

ప్రతి నెల, ప్రతి రోజూ ఎవరిదో ఒక నాయకుని పుట్టినరోజు, పరమ పదించినరోజు, లేదా పండుగలు వస్తుంటాయి, వాటిని పురస్కరించుకొని నగరంలో విచ్చలవిడిగ తమ నాయకుని ప్రాపకం కోసం కార్యకర్తలు ఒకరికొకరు పోటీపడుచూ పెద్దపెద్ద ఫ్లెక్స్ ప్రింట్ చేసి నగరంలో ఎక్కడ పడితే అక్కడ కట్టడం, ప్రధాన కూడళ్లలో ప్రతిష్ఠించిన మహనీయుల విగ్రహాలకు అడ్డుగా కట్టడం, రహదారి మూసుకుపోయే విధంగా అటు నుండి ఎదురుగా ఎవరు వస్తున్నారో తెలియని విధంగా అడ్డంగా కట్టడం తో మహనీయుల విగ్రహాలు కనపడకపోవడం ఒక ఎతైతే… మరో వంక ఎదురుగా వచ్చే వారు కనపడక ఎక్సిడెంట్లు (ప్రమాదాలు జరగడం) అవడం, కొందరు ప్రాణాపాయ స్థితికి చేరడం జరుగుచున్నది.

కనుక కార్పొరేషన్ అధికారులు ఫ్లెక్స్ ప్రింట్స్ కొలతలపై ఒక నిర్ధుష్టమైన నిర్ణయం తీసుకోవాలి. వాటిని పెట్టే స్థలాలను సైతం గుర్తించి వాటిని అక్కడ మాత్రమే కట్టేలా చూడాలి. ఎట్టి పరిస్థితులలో మహనీయుల విగ్రహాలకు ఫ్లెక్స్ కట్టే సంస్కృతి నుండి మార్పు తెచ్చే విధముగా కృషిచేయాలి. పర్యావరణ హితార్ధం వస్త్రాల ఫ్లెక్స్ తో మాత్రమే ప్రచారం చేసే విధముగా ప్రత్యేక అవగాహనా సమావేశాలు నిర్వహించాలి, ప్రోత్సహించాలి అని ఒంగోలు నగర పౌరులు కార్పోరేషన్ అధికారులకు మనవి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *