జిల్లా ముఖ ద్వారం గుండ్లపల్లి గ్రోత్ సెంటర్లో మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం లభించింది. మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ , జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి పూల బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. గుండ్లపల్లి గ్రోత్ సెంటర్ వద్ద పార్టీ నాయకుడు లింగా రామకృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన వేదికపై సంతనూతలపాడు నియో జకవర్గంలోని నాయకులు పలువురు ఆయనకు పూల మాలలు వేసి శాలువాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం మద్దిపాడు ఎంపీపీ వాకా ఆరుణ కోటిరెడ్డి స్థానిక నాయకులతో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డికి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్ గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం బాలినేని గ్రోత్ సెంటర్ ముఖ ద్వారంలో ఉన్న దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల
మాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో ప్రతిసీటును వైఎస్ఆర్ సీపీ గెలిచేలా నాయకులంతా కృషి చేయాలని, అందుకు కార్యకర్తలే ముఖ్యమైన బలం అన్నారు. కార్యకర్తలకు నాయకులు అండగా నిలిచి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. జిల్లాలో ప్రతి సీటు గెలిచి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని చెప్పారు. త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు ముందుకు వెళ్లేం దుకు ప్రణాళిక వేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు దుంపా చెంచిరెడ్డి మండవ అప్పారావు. పోలవరపు శ్రీమన్నారాయణ, ఎంపీపీలు వాకా అరుణ కోటిరెడ్డి,నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మారెళ్ల బంగారు బాబు, జెడ్పీటీసీ సభ్యులు వేమా శ్రీనివాసరావు, తేళ్ల భాగ్యలక్ష్మి పుల్లారావు, పలువురు సర్పంచ్లు, ఎం పీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.


