ఓట్ల మార్పులు చేర్పుల్లో తేడాలుంటే ఫిర్యాదు చేయవచ్చని ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈ.ఆర్.వో) ఎంవీఎస్ లోకేశ్వరరావు సూచించారు. దర్శి రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీ నాయకులతో ఆయన సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నాటికి దర్శి నియోజకవర్గంలో 2,23,685 ఓట్లు ఉన్నాయని, వీరిలో 1,12 868 ఓట్లు పురుషులవి కాగా 1,10, 807 ఓట్లు స్త్రీలవి, పది మంది ట్రాన్స్ జండర్లు ఉన్నా రన్నారు. దొనకొండ మండలంలో 37,488 మంది ఓటర్లు ఉండగా 19,014 మంది పురుషులు, 18,474 మంది స్త్రీలు, కురిచేడు మండలంలో 31,887 మంది ఓటర్లు ఉండగా 16,147 మంది పురుషులు, 15,738 మంది స్త్రీలు, ఇద్దరు ట్రాన్స్ జండర్లు, దర్శి మండలంలో 72,120 మంది ఓటర్లు ఉండగా 36,242 మంది పురుషులు, 35,873 మంది స్త్రీలు, ఐదుగురు ట్రాన్స్ జండ ర్లు ఉండగా (మండలంలోని దర్శి అర్బన్లో 29,327 మంది ఓటర్లుకుగాను 14,482 మంది పురుషులు, 14,845 మంది స్త్రీలు ఉన్నారు. దర్శి రూరల్లో 12,793 మంది ఓటర్లు ఉండగా అందులో 21,760 మంది పురుషులు, 21,028 మంది స్త్రీలు, ఐదుగురు ట్రాన్స్ జండర్లు ఉన్నారు). ముండ్లమూరు మండలంలో 44,938 మంది ఓటర్లు ఉండగా 22,700 మంది పురుషులు, 22,235 మంది స్త్రీలు, ముగ్గురు ట్రాన్సండర్లు, తాళ్లూరు మండలంలో 37,252 మంది ఓటర్లు ఉండగా 18,765 మంది పురుషులు, 18,487 మంది స్త్రీలు ఉన్నారు. జాబితాలో ఏమైనా సందే హాలుంటే ఆయా మండలాల తహసీల్దార్లకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు.


