బిజెపి తరఫున ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీకి సై – భాజపా జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి.

అధిష్టానం ఆదేశిస్తే ఒంగోలు బరి నుండి శాసనసభకు పోటీకి నేను సిద్ధమంటూ భారతీయ జనతా పార్టీ మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము నాయుడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో నిలుస్తుందన్న ఆశభావం ఉన్నదని, కావున అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా ఒంగోలు శాసనసభకు ఎన్నికలలో పోటీ చేస్తానని ఆయన తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఏకపక్ష గెలుపుకు తాను అనుకూలం కాదని కనుక ప్రత్యర్ధులు ఎవరైనా, ఏ పార్టీ వారైనా నేను బరిలో ఉంటే వారికి విజయం అంత సులువుగా లభించదని పేర్కొన్నారు. ఒకవేళ ఇతర పార్టీలతో బిజెపికి పొత్తు కుదిరితే, మిత్రపక్షం తరపున అభ్యర్థి ఎన్నికల బరిలో ఉంటే అధిష్టానం ఆదేశానుసారం పనిచేస్తానని వివరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

తన బయోడేటాను వివరిస్తూ కాపు సామాజిక వర్గానికి చెందిన తాము ఎలాంటి రాజకీయ నేపధ్యం లేదని, నాగులుప్పలపాడు బ్రాహ్మణ నిడమానుారు కు చెందిన నాగేశ్వరరావు, శేషమ్మ దంపతుల కుమారుడనని, తమ కుటుంబం వ్యాపార నిమిత్తం ఒంగోలులో స్థిర నివాసం ఏర్పరచుకొని స్వగృహ స్వీట్స్ పేరుతో మిఠాయిలు తయారు చేస్తామని తెలిపారు.

శర్మా కళాశాలలో బి.కాం, ప్రాధమిక విద్య డి ఆర్ ఆర్ యం హై స్కూల్ లో చదివానని, తన అర్ధాంగి ధనిశెట్టి పావని భాజపా ఒంగోలు నగర మహిళామోర్చా అధ్యక్షురాలిగ పనిచేస్తున్నారని, కుమార్తె సాయిసహస్రకు 3 సం.రాలని తెలిపారు.

తను బిజేపి కార్యకర్తగ 14సం.లుగా పార్టీలో వివిధ బాధ్యతలను నిర్వర్తించి గత సం.వత్సరముకు పైగా బిజేపి జిల్లా మీడియా ఇంఛార్డ్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 2021వ సం. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో 26వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రత్యర్ధులకు గట్టిపోటీ ఇచ్చానని వివరించారు.

సామాజిక సేవలలో తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నానని, 130 సం. చరిత్రగల సివిఎన్ రీడింగ్ రూం మరియు క్లబ్ లో గత 19సం.గా జీవిత సభ్యత్వం కలదని, ఆలిండియా మహాత్మా సోషల్ క్లబ్ ఒంగోలు కు కోశాధికారిగ పలు ధార్మిక, సామాజిక కార్యక్రమాలు నిర్వహించానని మరియు 14 సార్లు రక్తదానం చేశానని, వివరించారు.

వ్యాపారపరంగా రోజు ఎంతోమంది ప్రజలతో అనుబంధాన్ని కలిగి వివిధ సామాజిక వర్గాల ప్రజలతో మమేకమై అందరితో కలిసిపోగల సామర్థ్యం గల వ్యక్తిని, సమాజంలో అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉన్నానని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క ఆర్థిక పరిస్థితుల్లో మాత్రమే కొద్దిగా వెనకబడి ఉన్నానని అయినప్పటికీ ఏ విషయంలోనూ ఏ ఒక్కరికి తీసుకోనని వినమ్రతతో తెలిపారు. సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటూ జాతీయ అంతర్జాతీయ విషయాలను గ్రహిస్తుంటానని తెలిపారు.

కావున పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఒంగోలు నుండి శాసనసభ ఎన్నికలలో నిలబడి అందరినీ కలుపుకొని గెలిచే సత్తా ఉన్నదని తెలిపారు.

సామాజిక అంశాలు, రాజకీయాలపట్ల అవగాహన కలిగిన యువకుడు, గెలుపు పై ధీమా కలిగిఉన్న ధనిశెట్టి రామునాయుడుకు ఆల్ ద బెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *