వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ఆసియాఖండంలోనే అతి పెద్దవైన సొరంగాల పనులను పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర తిరగరాశారని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. దర్శి లో బూచేపల్లి నివాసంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. వెలిగొండ హెడ్ రెగ్యులేటర్ పనులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని, శ్రీశైలానికి వరద నీరు వస్తే వెలిగొండ ప్రాజెక్ట్ కు తరలిం చడమే తరువాయి అని అన్నారు. వైఎస్సార్ జీవించి ఉంటే వెలిగొండ ఎప్పుడో పూర్తయ్యేదని చెప్పారు. 1996లో చంద్రబాబు శంకుస్థాపన చేసి వదిలేయగా.. 2004లో అధికారం లోకి వచ్చిన వైఎస్సార్ 18.838 కి.మీ పొడవైన మొదటి సొరంగంలో 11.756 కి.మీ, 18.838 కి.మీ పొడ వైన రెండో టన్నెల్‌ను 8.747 కి.మీ పూర్తి చేశారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందన్నారు. 2014లో అధికారం లోకి వచ్చిన చంద్రబాబు మొదటి సారంగాన్ని 4.331 కి. మీ, రెండో సొరంగాన్ని 2.335 కి. మీ మాత్రమే తవ్వించారన్నారు. 2019లో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్ మొదటి టన్నెల్ లో మిగిలిన 2.883 కి. మీను 2021 జనవరి 13వ తేదీకే పూర్తి చేశారన్నారు. రెండో టన్నెల్లో మిగిలిన 7.698 కి.మీ ఈనెల 23వ తేదీ నాటికి పూర్తి చేశారని చెప్పారు. చంద్రబాబు హయాంలో రెండు సొరంగాలు కలిపి 6.686 కి.మీ తవ్వితే.. వైఎస్ జగన్మో హన్‌రెడ్డి మాత్రం 10.581 కి.మీ తవ్వించి పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చారన్నారు. దర్శి, కురి
చేడు, దొనకొండ మండలాలకు తాగునీటితోపాటు కురిచేడు మండలంలో 6 వేల ఎకరాలు, దొనకొండ మం డలంలో 17 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నాయని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌కు రైతులు, ప్రజల తర పున కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ఏటీఎంలా వెలిగొండ
చంద్రబాబు దోచుకోవడమే లక్ష్యంగా వెలిగొండ ప్రాజెక్టు ఏటీఎంలా వాడుకుని కాంట్రాక్టర్లకు రూ.650 కోట్లకు పైగా దోచి పెట్టారని బూచేపల్లి విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు రూ.1414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడం బాబు దోపిడీని స్పష్టం చేస్తోందన్నారు. రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి అంచనా వ్యయం పెంచి వాటిని అధిక ధరలకు సీఎం రమేష్‌కు కట్టబెట్టి కమీషన్లు దండుకున్నారని దుయ్యబట్టారు. సీఎం రమేష్ కు కట్టబెట్టిన రెండో సారంగంలో మిగిలిన పనులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా చం ద్రబాబు అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేశారన్నారని వివరించారు
