పంటలకు తుంపర సేద్యంతో నీరు పెట్టడం ద్వారా బెట్ట నుంచి కాపాడు కోవచ్చని వ్యవసాయాధికారి ప్రసాదరావు తెలిపారు. తాళ్లూరు మండలంలోని కొర్రపాటివారిపాలెంలో బుధవారం క్షేత్ర పర్యటనలో భాగంగా రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. రైతులు సాగు చేసిన ఎలాంటి
పంటలకైనా తుంపర సేద్య విధానం అమలు చేయవ చ్చన్నారు. తద్వారా కలువలు, గట్టు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదన్నారు. దీంతో భూమి, పంట నష్టపోకుండా ఉంటుందన్నారు. మొక్కలకు అవసర మైన నీటిని ఎక్కువ సార్లు అందించవచ్చన్నారు. నీరు ఎక్కువగా నిల్వ ఉండదన్నారు. మట్టి గడ్డకట్టద న్నారు. పైరుకు అవసరమైన గాలి, వెలుతురు అవసరమైన మేర అందుతుందన్నారు. ఎక్కువ దిగు బడులకు అవకాశం ఉందన్నారు.
