గుంటి గంగలో అన్ని రకాల పూజలు

జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీగుంటిగంగా భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం నుంచి ప్రతి రోజూ అర్చన, అష్టోత్రం సహస్రనామం పూజలు అందుబాటులో ఉంటాయని దేవస్థానం చైర్మన్ కొసనా గురుబ్రహ్మం, ఈఓ కార్తీక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలతో గురువారం సమా వేశం నిర్వహించారు. ఆలయంలో తాత్కాలిక పూజారులుగా పని చేస్తున్న విజయలక్ష్మి, బాలరాజు, వాహన పూజారి కామేశ్వరరావుతో పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఆలయ మాజీ చైర్మన్ సానే ఆంజనేయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *