తాళ్లూరు మండలంలో పలువురు అధికారులు తమ శాఖల పరధిలో ఉత్తమ సేవలు అందించినందుకు ఉత్తమ సేవా పురష్కారాలను అందుకున్నారు. ఒంగోలులో జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు, తాళ్లూరు పీహెచ్ సి సిహెచ్ఓ ప్రమీల, ఫార్మాసిస్ట్ రమేష్ అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఉత్తమ సేవా అవార్డులు అందుకున్న అధికారులకు బంధు మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.



