గణ తంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవా అవార్డు అందుకున్న తాళ్లూరు మండల వ్యవసాయాధికారి ప్రసాదరావును శనివారం వ్యవసాయ సిబ్బంది, రైతులు ఘనంగా సన్మానించారు. వ్వవసాయంలో నిత్యం మారుతున్న వాతావరణ మార్పులకు, సాంకేతికతను రైతులు దృష్టికి తీసుకువెళ్లి మంచి ఫలితాలు సాధించిన వ్యవసాయాకారి బి. ప్రసాదరావుకు ఉత్తమ అవార్డు రావటం మిగిలిన సిబ్బందికి స్పూర్తి దాయకమని వక్తలు అన్నారు. తాను రైతులకు సేవలు అందించటానికి సహకరించిన భాగస్వామి, ఆర్బికే సిబ్బంది సహకారం ఉందని, ఇంటిలో తన భాగస్వామి, పిల్లలు చేయూత ప్రతి ఉద్యోగికి ఎంతో ఉపకరిస్తుందని అన్నారు. సిబ్బంది సహకారంతో సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని వ్యవసాయాధికారి ప్రసాదరావు అన్నారు. తనను గుర్తించి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసిన జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్‌కుమార్, జెడీ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలోడీలర్ల సంఘ అసోషియోషన్ అధ్యక్షుడు జె వెంకటరావు, నాగార్జున రెడ్డి, హనుమా రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్బారావు, గుర్నాధం, సీతారామయ్య, ఎఈఓలు, విఏఏలు పాల్గొన్నారు.



