జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా గ్రామాలలో ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని తాశ్రూలు ఎంపీడీఓ కెవై కీర్తి అన్నారు.తాళ్లూరు మండలం వెలుగువారిపాలెంలో శనివారం తూర్పుగంగవరం పీహెచ్సీ పరధిలో జగనన్న సురక్ష -2 కార్యక్రమం నిర్వహించారు. సర్పంచి ఎం కోటేశ్వరమ్మ, ఎంపీటీసీ ఎం వెంకటేశ్వర్లు, బ్రహ్మా రెడ్డి, ఎంపీడీఓ కెవై కీర్తిలు ప్రారంభించారు. పీహెచ్సీ వైద్యాధికారి కె మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యులు హెమాంజలి, రంఘనందన్ లు 305 మందికి పరీక్షలు నిర్వహించి అవసమైన వారికి ఈసీజీ, హెచ్బీ, యూరిన్ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేసారు. 45 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. హెచ్ఐఓ చంద్రశేఖర్ బాబు, పీహెచ్ ఎన్ మస్తానమ్మ, హెచ్. వి సుశీల, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


