ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి తిరుణాల పొట్లపాడులో వేంచేసి ఉన్న శ్రీ గుత్తికొండ రామయోగి స్వామి తిరుణాల అనే విషయం అందరం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. భక్తుల కొంగుబంగారమైన పొట్లపాడు యోగయ్య స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు రావడం విశేషం. 113 ఏళ్ల క్రితం గ్రామంలోనే జీవ సమాధి కాబడిన రామయోగి స్వామివారిని దర్శించుకుని ఏదైనా మనసులో తలచుకుంటే అది త్వరితగతిన పరిష్కారం అవుతుందని అటు భక్తులు ఇటు స్థానిక ప్రజల్లో విశేష నమ్మకం ఉంది. ప్రతి యేటా తిరుణాలకు భక్తులు విద్యుత్ ప్రభలు ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు రెండు విద్యుత్ ప్రభలు, ఎడ్ల పందాలు, గ్రామంలో ఏర్పాటుచేసి వచ్చిన బంధుమిత్రులతో సహా ఉత్సాహాన్ని పొందుతున్నారు గ్రామస్తులు. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి తిరణాల దర్శి నియోజకవర్గం నుండి పొట్లపాడు తిరుణాల కావడం విశేషం.
