తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరం గ్రామ జడ్పీహైస్కూల్ ఒంగోలు ఎస్ఆర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరం లో 369 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్ఆర్ హాస్పిటల్ చైర్మన్, లక్కవరం గ్రామస్తుడు డాక్టర్ శ్రీనివాస్, నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందారెడ్డి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, డాక్టర్ చిన్న, వలి, వెంకటరమణ పాల్గొన్నారు.
