పేద, బడుగు, బలహీనవర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ సారథులుగా వలంటీర్లు నిలిచారని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జ్, డాక్టర్ బూచేపల్లిశివప్రసాద్ రెడ్డి కొనియాడారు. తాళ్లూరు మండల పరిషత్ సమావేశపు హాలులో బుధవారం సాయంత్రంమండల వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామాల వారీగా వలంటీర్ల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.సేవాభావంతో, జగనన్నపై అభిమానంతో నిత్యం ప్రజల మధ్యే ఉంటూమీకు కేటాయించిన కుటుంబాలకు అబివృద్ధి, సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మీ రుణం తీర్చుకోలేనిదని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ శివప్రసాద్ రెడ్డిలు అన్నారు. ఒకటో తేదీ తెల్లారక ముందే తలుపుతట్టి
పింఛన్లు అందిస్తున్న వలంటీర్లను కించపరుస్తున్ననారా చంద్రబాబు నాయుడుకు రానున్న ఎన్నికల్లోతగిన గుణపాఠం చెప్పాలన్నారు. వానొచ్చినా, వరదొచ్చినా, కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు చేసినసేవలు మరువలేనివన్నారు. అందుబాటులో లేని వృద్దులు, వికలాంగులు, అనారోగ్యంతో హాస్పిటల్లోచికిత్స పొందుతున్న వారికి సుదూర ప్రాంతం వెళ్లిపింఛన్లు అందజేయడం అభినందనీయమన్నారు.
రానున్న ఎన్నికల్లోనూ సైనికుల్లా పనిచేసి జగనన్ననుమళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని శివప్రసాద్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలుపించుకుందామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పిలుపునిచ్చారు. వలంటీర్లు తెలిపినసమస్యలపై స్పందిస్తూ పలు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. వలంటీర్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినాచీమకుర్తి, దర్శిలోని తమ ఇంటి తలుపులు 24 గం టలూ తెరిచే ఉంటాయన్నారు.
సమావేశంలో ఎంపీడీఓ కె.యుగకీర్తి, వైస్ ఎంపీపీ యిడమకంటి వెంకటే శ్వరరెడ్డి,జిల్లా కో ఆప్షన్ సభ్యుడు షేక్ ఆదాం షరీఫ్,వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు తూము వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్ చార్లెస్సర్జన్, ఎంపీటీసీ యామర్తి ప్రభుదాసు, నాగలక్ష్మి, మాజీ ఎంపీపీలు కోట రామిరెడ్డి, పోశం మధుసూదనరెడ్డి, గోళ్లపాటి మోషే, ఈఓఆర్డీ కేజీఎస్ రాజు, కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం సరస్వతి విద్యాసంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి ఆహ్వానం మేరకు విందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లు హాజరయ్యారు.



