విద్యార్థులలో రక్తహీనతను నివారించి ఆరోగ్యవంతమైన పౌరులకు తీర్చిదిద్దుటకు ప్రభుత్వం ప్రతి గురువారం విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ మాత్రము అందిస్తుందని ప్రధానోపాధ్యాయుడు పోలం రెడ్డి సుబ్బా రెడ్డి అన్నారు. స్థానిక ప్రాధమిక పాఠశాల (ఎఎ)లో గురువారం విద్యార్థులకు ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో విద్యార్థులు మాత్రలు పంపిణీ చేసారు. ఆశ కార్యకర్త అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
