ఈ నెల 10 వ తేదీన ఉదయం 10 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి BRS పార్టీ సమావేశం నిర్వహించనున్నట్లు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద నియోజకవర్గ పరిధిలోని BRS పార్టీకి చెందిన కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు,డివిజన్ అద్యక్షులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు, అభిమానులు పాల్గొంటారని చెప్పారు. పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఆరు గ్యారెంటీల అమలుకు ఇంకా 40 రోజులే….
రాష్ట్రంలో కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు ప్రకటించిన 100 రోజులలో 60 రోజులు గడిచాయని, ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గడువులోగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల పక్షాన పోరాడేందుకు వెనుకాడబోమని చెప్పారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేస్తున్నామని చేస్తున్న ప్రచారం అవాస్తవమని, కేవలం RTC బస్సులలో ఉచిత ప్రయాణం కార్యక్రమం ఒక్కటే అమలు అవుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరు కూడా తాము అధికారంలో లేమని అదైర్య పడొద్దని, గతంలో మాదిరిగానే అన్ని వేళలా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో గత BRS ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులను మంజూరు చేసినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిధులు లేవనే కారణంతో పనులను అడ్డుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారని అన్నారు. కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు కొలను లక్ష్మి, టి.మహేశ్వరి, కుర్మ హేమలత, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, డివిజన్ అద్యక్షులు కొలను బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, ఆకుల హరి కృష్ణ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



