పాడి రైతులు అధిక పాల ఉత్పత్తికి మెలకువలు పాటించాలి – కె.వి.కే పశు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. లీలా కృష్ణ

అధిక పాల ఉత్పత్తికి పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ద్వారా పశువుల శరీర పోషణ మరియు ఉత్పత్తి సామర్థ్యానికి మేపు తోనే అధిక పాల దిగుబడి సాధ్యమవుతుంది. పశువులలో ఖనిజ లవణ లోపాల వలన వచ్చే సమస్యలను అధిగమించడానికి ప్రతి పశువును రోజుకు 50- 80 గ్రాముల చొప్పున ఖనిజ లవణ మిశ్రమాన్ని దానాతో గేదెలకు అందవ్వాలని తద్వారా పాలల్లో అధిక దిగుబడి తెచ్చుకోవచ్చని దర్శి కృషి విజ్ఞాన కేంద్రం పశు విభాగ శాస్త్రవేత్త డాక్టర్ లీలా కృష్ణ తెలియజేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్- కృషి విజ్ఞాన కేంద్రం ల ఆధ్వర్యంలో తాళ్లూరు మండలం దారoవారిపాలెం గ్రామంలో రైతు భరోసా కేంద్రం నందు పశుపోషణ మరియు పశుగ్రాస పెంపకంపై రైతులకు రెండ వ రోజు శిక్షణ కార్యక్రమo నందు ఆమె మాట్లాడుతూ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ బి.వి.రామిరెడ్డి మాట్లాడుతూ మంచి పశుగ్రాసాల ద్వారా అధిక పాల ఉత్పత్తి పెంచుకోవాలంటే పశువులకు సంపూర్ణ ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్క పాడి రైతు రైతు భరోసా కేంద్రాల్లో ఇచ్చే సూచనలు పాటించాలని ఆయన తెలియచేశారు. దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ పశువులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రవేశపెట్టిన పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను తప్పనిసరిగా పాడి రైతులందరూ ఉపయోగించుకొని క్రమం తప్పక వ్యాక్సిన్ వేయించాలని ఆయన తెలియజేశారు. గ్రామ పశు వైద్య సహాయకుడు ఎం. రాజేష్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న పశుపోషకులు వారి వద్ద ఉన్న గేదెలు, మేకలు, గొర్రెలు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇన్సూరెన్స్ పథకాన్ని వినియోగించుకోవాలని తద్వారా మీ పశువులకు నష్టం జరిగినప్పుడు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీ నుండి నష్టపరిహార పొందవచ్చు అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి బి ఆర్ సి ఏరియా కో-ఆర్డినేటర్ గోపనబోయిన వెంకట్రావు, గ్రామంలోని పశు పెంపక రైతులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *