ప్రపంచమే ఓ రంగస్థలం.. మనమంతా అందులో పాత్రదారులమని , ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ అన్నారు.
శుక్ర వారం, వనస్థలిపురం హిల్ కాలనీ లో ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా, ప్రముఖ సంస్థ “ఆకృతి”ఆధ్వర్యంలో, ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్న మల్లాది గోపాల కృష్ణ ను ఘనంగా సత్కరించారు..
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న చంద్రకుమార్ మాట్లాడుతూ నాటకం ఎంతో ప్రాచీన కళా రూపం అంటూ, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున విభిన్న కార్య క్రమాలు జరుగుతాయన్నారు.. రంగస్థలం మీద విశేషంగా రాణించిన సీనియర్ నటుడు మల్లాది గోపాల కృష్ణ ను సన్మానిచడం హర్షణీయమన్నారు.. గోపాల కృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం లో విద్యార్థులకు మార్గదర్శి గా, ఆహార్యం విభాగంలో అధ్యాపకులుగా ఎంతో విశేష సేవలు అందిస్తున్నారు అంటూ ప్రశంసించారు.. అన్ని దానాల్లో విద్యాదానం గొప్పది అన్నారు.. రంగస్థల కార్య క్రమాలకు ఆదరణ తగ్గిపోతున్న దశలో తెలుగు విశ్వవిద్యాలయం విభిన్న కళా విభాగాలను ఏర్పాటు చేసి చేస్తున్న కృషి ప్రశంస నీయమని అన్నారు.. గౌరవ అతిథి గా విచ్చేసిన కేంద్ర ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు కృష్ణాది శేషు మాట్లాడుతూ రంగస్థల కళల విస్తృతికి గోపాల కృష్ణ చేస్తున్న కృషి ఎనలేనిది అన్నారు.. ఆయన అయిదు నంది అవార్డులను స్వీకరించారనీ అన్నారు.. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు లాంటి మహానటుల.నుంచి గోపాల కృష్ణ ప్రశంసలు అందుకున్నారు అని కొనియాడారు. కార్య క్రమానికి ఈ ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు. ఈ కార్య క్రమం లో మదర్ థెరీసా ఫౌండేషన్ అధ్యక్షుడు శంకర్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
