తెలుగు మొదటి ప్రధాని, బహుభాష కోవీదుడు,ఆర్థిక సంస్కరణలకు ఆధ్యుడు, తెలంగాణ ముద్దుబిడ్డ, స్థితప్రగ్యా శ్రీ పీ. వి. నరసింహ రావు కు మరణానంతరం భారత ప్రభుత్వం భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. శనివారం రాష్ట్రపతి భవన్
లో దేశ అత్యునత పురస్కారం అయిన .భారతరత్న.అవార్డ్ ను రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదుగా పి.వి తనయులు పీ.వి.ప్రభాకర్ రావు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో పి.వి.కుమార్తె సురభి వాణీ దేవి.కుటుంబ సభ్యులు అజిత.శేఖర్ మారం రాజు.తదితరులు పాల్గొన్నారు. ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా బేగంపేట బ్రాహ్మణ వాడి లైన్ నంబర్ 9 లోని స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ భవన ప్రాంగణం లో వున్న శ్రీ పి. వి నరసింహారావు విగ్రహానికి పుష్పాంజలి సమర్పించారు, మిఠాయిల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్వామి రామానంద తీర్థ మెమోరియల్ మోడల్ స్కూల్ టీచర్స్, పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని వారి సంతోషా న్ని తెలియజేశారు.




