విద్యార్థులకు క్రమశిక్ష ణతో కూడిన విద్యను అందించాలని ఎంఈఓ జి.సుబ్బయ్య అన్నారు. తాళ్లూరు మండలంలోని దోసకాయలపాడు ప్రాథమిక పాఠశాలను మంగళవారం ఎం ఈఓల -1సుబ్బయ్య, ఎంఈఓ 2 సుధాకర్ రావు లు వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరును పరి శీలించారు. ఉపాధ్యాయులు వృత్తి నైపుణ్యాలు, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను పరిశీలిం చారు. మెరుగైన విద్యను అందించేందుకు తగిన సలహాలు, సూచనలు చేశారు. మధ్యాహ్న భోజ నాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ప్యానల్ ఉపాధ్యాయులు కొండయ్య, నాగరాజు, హెచ్ఎం
ప్రసన్నాదేవి, ఉపాధ్యాయులు ఆశాజ్యోతి, సీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

