ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో బుధవారం రెవిన్యూ అసోషియేషన్ భవన్లో పోస్టల్ ప్రమాద భీమా పాలసీ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోషియేషన్ రాష్ట్ర నాయకులు డాక్టర్ జూలాది మణిబాబు, బిజేపి అధికార ప్రతినిధి బొద్దిలూరి ఆంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. భీమా పాలసీ విశిష్టతను, వృత్తిలో జర్నలిస్ట్ లు ఎదుర్కోంటున్న ఒత్తిడి, ప్రమాదం జరిగే అవకాశాలు, జర్నలిస్ట్ ల కు పాలసీ వలన ఆపదలో కలిగే ప్రయోజనాలను వక్తలు వివరించారు. అసోషియేషన్ అధ్యక్షుడు జి అజయ్ బాబు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ లు శిబిరంకు రాకపోయి ఉంటే అసోషియేషన్ కార్యవర్గాన్ని సంప్రదించి భీమాపాలసీ అందుకోవాలని కోరారు. కార్యదర్శి ఒంగోలు వసంత్ కుమార్, ఉపాధ్యక్షుడు అంగలకుర్తి ప్రసాద్, కోశాధికారి వే సుకోగు కోటయ్య, కమిటీ సభ్యులు సర్వేశ్వరరావు, శ్రీలేఖ అజయ్, బుజ్జి, అనిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
