- ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ.కొత్తకోట శ్రీనివాస రెడ్డి మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ ల ఆదేశాల మేరకు బుధవారం రాజ్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలవిద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ బేగంపేట ఫ్లై ఓవర్ మీద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న పిలియన్ రైడర్ మరణించిన విషయం గుర్తుచేస్తూ అందరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని , వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం, నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి వ్యక్తి మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయునప్పుడు BIS ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత శిరస్త్రాణం ధరించాలి. మైనర్లు (18 సంవత్సరాల లోపు పిల్లలు) వాహనాలు నడపరాదని ఆది చట్టరీత్య నేరమని తెలిపినారు. అలా వాహనాలు నడిపినచో తల్లిదండ్రులు మరియు వాహన యజమానికి జైలు శిక్ష పడే అవకాశం ఉంది మరియు వాహనం యొక్క రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది అని తెలియజేసినారు.ఈ కార్యక్రమములో సుమారు 80 మంది విద్యార్థులు మరియు హెడ్ మాస్టర్ కరుణశ్రీ సిబ్బంధి లతా, సురేందర్, గీత మరియు అబ్దుల్ మాజిద్ హెచ్ జీ తదితరులు పాల్గొన్నారు.