ఓటర్ల జాబితా సవరణ పై అఖిలపక్షంతో అధికారుల సమావేశం -బూత్ స్థాయి(బి ఎల్ ఓ లు) అధికారులు ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వి సమ్మయ్య.

 

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

 

ఓటర్ల జాబితా సవరణ పై అఖిలపక్షంతో అధికారులు సమావేశం నిర్వహించారు ఈ సమావేశం జిహెచ్ఎంసి బేగంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వీ సమ్మయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బూతు స్థాయి
(బి ఎల్ వోలు) అధికారులుఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని అన్నారు. పోలింగ్ స్టేషన్ల ఉన్నారు వ్యవస్థీకరణ, పోలింగ్ స్టేషన్లను అప్డేట్ చేసేందుకు బూతు స్థాయి అధికారుల దే కీలకపాత్ర అన్నారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహకారంతో ఓటర్ల జాబితాలో తప్పులు సవరించనున్నట్లు ఆయన తెలియ జేశారు. అవసరమైన చోట ఓటర్ల జాబితా కోసం కొత్త ఫోటోలు సేకరిస్తారని ఆయన తెలియజేశారు. సవరించిన ఓటర్ల జాబితా తుది ప్రచురణ జనవరి 6 20 25 న జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య తెలియజేశారు. ఈ అఖిలపక్ష సమావేశంలో సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధామ్, రాంగోపాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు త్రికాల మనోజ్ కుమార్ తదితర పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *