చలన చిత్ర రంగం లో నందమూరి బాలకృష్ణ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా అఖిల భారత
ఎన్ టీ ఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బేగంపేట రసూల్ పురా చౌరస్తా లోని స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సనత్ నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కాట్ర గడ్డ ప్రసూన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి,సినీ వినీలాకాశంలో రారాజు గా అన్న నందమూరి తారక రామారావు వెలుగొండారని,వారి తనయుడు నట సింహం నందమూరి బాలకృష్ణ చలన చిత్ర రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు .ఎన్ టి ఆర్ అభిమాన సంఘం నాయకులు పిన్నమనేని సాయిబాబా మాట్లాడుతూ తెలుగు చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా అన్న ఎన్ టీ ఆర్ వెలుగొందారని ,వారి తనయుడు నందమూరి బాలకృష్ణ కూడా చలన చిత్ర రంగం లో తనకంటూ.ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు అని ఆయన మరెన్నో విభిన్నమైన పాత్రలు పోషించాలని తాను కోరుకుంటున్నానని అన్నారు.అఖిలభారత ఎన్ టి ఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు శ్రీపతి సతీష్ కుమార్ మాట్లాడుతూ తన తండ్రి దివంగత సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వరరావు స్థాపించిన అఖిల భారత ఎన్ టీ ఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు .నట సింహం నంద మూరి బాలకృష్ణ చలన చిత్ర రంగంలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించుకున్నారు అని అన్నారు . ఈ కార్యక్రమంలో కోట సోమలింగం,బత్తిన మురహరి గౌడ్,బొప్పన ప్రవీణ్,రవిచంద్ర,తిరుపతి నాయుడు,మహేష్,జగదీష్,
తెలుగు దేశం పార్టీ నాయకులు కానూరి జయశ్రీ,ఏం.రాజు,రాజేంద్రప్రసాద్,బోనాల.శ్రీనివాస్ గౌడ్,మల్లేష్,యాదగిరి,రవి, గిర్ని
శ్రీను,ప్రసాద్,మహేందర్,రామ్మోహన్,లక్ష్మీదేవి,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.