హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం – పిలియ రైడర్ తప్పనిసరి గా హెల్మెట్ ధరించాలి -ట్రాఫిక్ నియమాలు – రోడ్డు భద్రతపై అవగాహన

బేగంపేట టిటిఐ ఎసిపి జి శంకర్ రాజు
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ.కొత్తకోట శ్రీనివాస రెడ్డి మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు శుక్రవారం స్ప్లెండిడ్ టవర్, బేగంపేట్ లోని ఎయిర్టెల్ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం బేగంపేట ఫ్లై ఓవర్ మీద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయుచున్న పిలియన్ రైడర్ మరణించిన సంఘటన మరిచిపోకముందే, నిన్న తార్నాకలో మరో వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రాయం చేస్తూ మరణించిన విషయం గుర్తు చేస్తూ అందరు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ వస్తువు కాదు మన ప్రాణాలు కాపాడే ఆయుధం అని సూచించారు. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం, నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి వ్యక్తి మోటార్ సైకిల్ పై ప్రయాణం చేయునప్పుడు BIS ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత శిరస్త్రాణం ధరించాలి. ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఒక్క నిమిషం ఆగే ఓపిక ఎవరికీ లేకుండా పోయింది, నిమిషం ఆగితే ప్రపంచం ఏమి కొట్టుకు పోదు అని చెప్పారు. నగరంలో రోడ్డు నేరాలు, ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ మరియు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ వాడకం వంటివి పెరిగాయి అని పేర్కొన్నారు. ఇట్టి కార్యక్రమములో సుమారు 100 మంది ఉద్యోగులు మరియు ఎయిర్టెల్ ఎం.డి. గోపాల్ మిట్టల్ మరియు సంస్థ ఉద్యోగులు శివమ్ భార్గవ, వాగీశ , గీత, సంతోష్ కుమార్ మరియు అబ్దుల్ మాజిద్ HG అధికారి TTI బేగంపేట పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *