జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశము నిర్వహణ – తీసుకోవాల్సిన చర్యలపై తగిన సూచనలు చేసిన, జాయింట్ కలెక్టర్, ఉప రవాణా కమిషనర్

జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశము శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గల సమావేశ మందిరము లో గౌరవ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగినది. కార్యక్రమమును ఉప రవాణా కమిషనర్ ఆర్ సుశీల ప్రారంభించారు. మే నెల 28 వతేదీ జరిగిన రహదారి భద్రత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మరియు తీర్మానాలపై
జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సమీక్షించారు.
చీమకుర్తి రోడ్డు లో ప్రమాదాలను తగ్గించుటకు గాను జంగిల్ క్లియరెన్స్ చేయమని మరియు రోడ్డును వెడల్పు చేసి రిపేరు చేయుటకు ఎస్టిమేషన్స్ తయారు చేయవలసిందిగా ఆర్ అండ్ బి వారిని ఆదేశించారు . ప్రస్తుతం తాత్కాలికంగా మైన్స్ డిపార్ట్మెంట్ సహకారంతో గుంతలను పూడ్చ వలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. సరిగ , సుబాబిల్ కర్రలను తీసుకెళ్లు ట్రాక్టర్లు ట్రైలర్ల అంతరాయము కలిగించే విధంగా ఉన్న యెడల కేసులు నమోదు చేయవలసిందిగా ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దర్శి ,పొదిలి, కనిగిరిల లో ప్రయాణికుల సౌకర్యార్థం మరియు ట్రాపిక్ నియంత్రణ కొరకు ఆటో స్టాండ్లను ఏర్పాటు చేయవలసిందిగా, ఒంగోలు నగరమునందు ట్రాఫిక్ నియంత్రణకు గాను రెండు మూడు చోట్ల ఫుడ్ కోడ్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా ఒంగోలు మున్సిపల్ కమిషనర్ కు ఆదేశములు ఇవ్వడం జరిగింది.. బెస్తవారిపేట లో రోడ్డు ప్రక్కనగల ఆక్రమణలు తొలగించ వలసినదిగా మున్సిపల్ కమిషనర్ మరియు పోలీసు శాఖ వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జిల్లా అంతట మోటార్ సైకిల్ సంబంధించి నెంబర్ ప్లేట్స్ గుర్తించి నిబంధనల ప్రకారము నెంబర్ ప్లేట్ సరిగా లేనియెడల కేసులు నమోదు చేయవలసిందిగా ఆదేశములు ఇవ్వడం జరిగినది. సింగరాయకొండ వద్ద గల విమాన అత్యవసర లాండింగ్ ప్రదేశము వద్ద రోడ్డు ప్రమాదములు జరుగ కుండా వెంటనే చర్యలు చేపట్ట వలసిందిగా ఎన్ హెచ్ ఎ ఐ-16 అధికారులకు ఆదేశములు అవ్వటం జరిగినది.

“పత్రికల లో రోడ్లపై వ్యతిరేక వార్తలు వచ్చినప్పుడు వెంటనే గుర్తించి సంభందిత శాఖ ఆ రోడ్లను రిపేరు చేసి తగిన రిపోర్టును ఇవ్వవలసిందిగా ఆదేశించినారు. జిల్లా అంతట తనిఖీలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను తగ్గించవలసినదిగా పోలీసు రవాణా శాఖ అధికారులకు ఆదేశములు ఇచ్చారు.
సమావేశము లో అడిషనల్ ఎస్పీ శ్రీ శ్రీధర్ , మార్కాపురం ఆర్టీవో బి అమర్ నాయక్ , ఇతర రవాణా శాఖ అధికారులు , ఆర్ అండ్ బి, వైద్య ఆరోగ్యశాఖ నేషనల్ హైవేస్, గ్రామా కేర్ పశుసంవర్ధక శాఖ తదితర అధికారులు తదితరు లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *