తాళ్లూరు మండలంలో బిజేపి సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చెయ్యాలని బిజేపి జిల్లా ఉపాధ్యక్షుడు, తాళ్లూరు మండల సభ్యత్వ నమోదు ఇన్చార్జి తిండి నారాయణ రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో పార్టీ సమావేశం శుక్రవారం మండల పార్టీ అధ్యక్షుడు అనుమల కోటేశ్వర రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2వ తేదిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. మండలంలో ప్రతి బూత్, పంచాయితీలలో సభ్యత్వ నమోదు అధిక సంఖ్యలో చెయ్యాలని కోరారు. రాష్ట్ర కిసాన్ మోర్చ ఉపాధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు మాట్లాడుతూ సభ్యత్వ నమోదును పండుగలా నిర్వహించాలని కోరారు. ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి జె ఆంజనేయులు, దర్శి రూరల్ మండల అధ్యక్షుడు కాకర్ల సాయి, ప్రధాన కార్యదర్శి సుబ్బా రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు మారం గోవింద రెడ్డి, చందోలు రామారావు, పుల్లా రావు, ఉప్పరపల్లి వేమా రెడ్డి, ఎస్సీ మోర్చ నాయకులు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
