ప్రభుత్వం పెన్షన్ లను సెప్టెంబర్ ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ చేపట్టింది. ఓవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ పెన్షన్ ల పంపిణీ లో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొంటున్నారు. తాళ్లూరు మండలం మాధవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో పంపిణీ లో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందిచారు. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి ఆదేశాలతో నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ జరుగుతుంది.