రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి సారిగా జరగబోతున్న వినాయక చతుర్థి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండ పాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుమతుల కోసం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించాం. https://ganeshutsav.net ద్వారా మండపాల ఏర్పా టుకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవాల నిర్వాహకులు ఈ వెబ్ సైట్ ను వినియోగించుకోవాలి అని సూచించారు.
గణేష్ మండపాల అనుమతులకు ప్రత్యేక వెబ్ సైట్ -మంత్రి నారా లోకేశ్
31
Aug