బేగంపేట విమానాశ్రయం డైరెక్టర్ పీకే హజారి పదవీ విరమణ……….నూతన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వరుదు వీ రావు…..పీకే హజారే సేవలను కొనియాడిన నూతన డైరెక్టర్ వరుదు వి. రావు ,ఉద్యోగులు……….

బేగంపేట విమానాశ్రయం లో గత మూడు సంవత్సరాలుగా డైరెక్టర్ గా సేవలు అందించిన పీకే హజారి శనివారం పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరుదు వీ రావు, మరియు విమానాశ్రయ ఉద్యోగులు పీకే హజారి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బేగంపేట విమానాశ్రయం నూతన జనరల్ మేనేజర్ గా ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వరుదు వి రావు మాట్లాడుతూ బేగంపేట విమానాశ్రయం కు ఎంతో చరిత్ర ఉందని అలాంటి విమానాశ్రయంలో సేవలందించిన పీకే హజారి ని తాను అభినందిస్తున్న అన్నారు. ఈ విమానాశ్రయంలో వీవీఐపీల రాకపోకలతో ఎంతో బిజీగా ఉంటుందని ,ఇలాంటి చోట బాధ్యతలు నిర్వర్తించడం ఎంతో జాగ్రత్తతో కూడిన విషయం అన్నారు. తన మూడేళ్ల హయాంలో ఉద్యోగులతో సన్నిహిత సంబంధాలు నెరిపి అందరి ఆదరాభిమానాలు చూరగొన్న పీ.కే.హాజరీ తన శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని తామంతా మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పీకే హజారే మాట్లాడుతూ బేగంపేట విమానాశ్రయంలో తన సిబ్బంది సహకారంతోనే మూడేళ్ల పాటు సేవలు అందించగలిగేనన్నారు అందరి సహకారాన్ని తాను గుర్తుంచుకుంటానన్నారు తనపై ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఉద్యోగికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నూతనంగా బాధ్యతలు చేపట్టిన వరుదు వీ రావుకు కూడా ఉద్యోగులంతా తమ సహకారాన్ని అందించాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమం లో జనరల్ మేనేజర్లు గోప కుమార్,కే.ఎస్.రావు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *