ఆంధ్రప్రదేశ్ సామాజిక పెన్షన్ పంపిణి చరిత్రలో అవ్వాతాతల ముఖాలలో చిరునవ్వులు పూచాయి. ఎన్డియే పక్ష కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే వారికి సామాజిక పెన్షన్ అందజేయడం, అదీ జోరు వానలో సైతం తెల్లవారుజామునే పింఛన్ డబ్బులు చేతికి అందడంతో వారి ఆనందం చెప్పనలవికాని విధంగా ఉందని బిజేపి జిల్హా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రామునాయుడు తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో నేడు పెన్షన్ పంపిణి చేసిన విధానంతో ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించదగినదని అభివర్ణించవర్ణించారు. ప్రతిపక్షం నివ్వెరపోయేలా నెల రాకుండానే ఒకరోజు ముందుగానే ప్రభుత్వ ఉద్యోగులు పని భారం అనుకోకుండా పంపిణి నిర్వహిస్తున్నారని ధనిశెట్టి తెలిపారు.
ఒంగోలు నగర కార్పోరేషన్ లోని 27, 30వ డివిజన్లో జోరున వానలో తడుస్తూ సచివాలయ ఉద్యోగులు, బిజేపి, జనసేన మరియు టిడిపి నాయకులతో మమేకమై సామాజిక పెన్షన్లు అందజేశారు.
పెన్షన్ పంపిణీలో ధనిశెట్టి రాము నాయుడు 27వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ పప్పు శ్రీనివాసరావు మరియు వాకాటి వెంకటేష్, కరీముల్లా, 30 వ డివిజన్ పరిధిలో నూతలపాటి శివ ప్రసాద్ పర్యవేక్షణ చేశారు.

