హిందూ ధార్మిక కార్యక్రమాలలో కుటుంబాలతో సహా పాల్గొనాలి-

సికింద్రాబాద్ కాపు సంఘం ఆధ్వర్యంలో మాత చౌకి అమ్మవారి పూజ……..

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

హిందూ ధార్మిక కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనే రోజులు రావాలని, కేవలం పూజలలో మహిళలే కాకుండా పురుషులు చిన్నారులు కూడా పాల్గొని హిందూ ధర్మం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్ కాపు సంఘం మహిళ అధ్యక్షురాలు అన్నం మంజుల ఆధ్వర్యంలో మాత చౌకీ అమ్మవారి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి పూజా కార్యక్రమాలు ప్రతి ప్రాంతంలో నిర్వహిస్తూ, హిందువులు కుటుంబాలతో సహా హాజరయ్యేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాతా చౌకి అమ్మవారి పూజ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు. పూజా కార్యక్రమంలో కార్యదర్శి గుణాల శ్రీనివాస్, కోశాధికారి అన్నం మనోజ్, ట్రస్టు సభ్యుడు సామల రామకృష్ణ ,అల్లాడి గీత, బేగంపేట ప్రకాశం నగర్ శ్రీ భూలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణదాత , సనత్ నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుదాం పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *