ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా వారికి కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ అన్నారు. ఆదివారం రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలోని అసుర ఖానా లో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు త్రికాల మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన చత్రీల పంపిణీ కార్యక్రమంలో కోట నీలిమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో గడచిన నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భారీ ఎత్తున నీరు రోడ్లపై నిలిచిపోతుందని, ఇలాంటి తరుణంలో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. మరో రెండు రోజులపాటు తుఫాన్ ప్రభావం ఉంటుందని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఈ సందర్భంగా ఆమె బస్తి బస్తీలో పర్యటించారు.ఈ సందర్భంగా ఆసుర ఖానా గల్లీలో 50 మంది కుటుంబాలకు
చత్రీలు పంచారు. అత్యవసర పనులు ఉంటేనే బయటికి రావాలని, లేకుంటే ఇళ్లలోనే ఉండాలని డాక్టర్ కోట నిలిమ సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు త్రికాల మనోజ్ కుమార్ ముదిరాజ్ , హేమంత్ సింగ్ ఠాకూర్, భాస్కర్, నుమాన్ ఖాన్, నాగరాజ్,, చందు, చక్రం, విన్ను మరియు బస్తివాసులు పాల్గొన్నారు.
