హ్యుమా నాయిడ్ రోబోట్ మానవ కృత్రిమ మెధస్సుతో అత్యంత ఖచ్చితత్వం, వేగవంతంగా ఇచ్చిన పని పూర్తి చేస్తుందని టిఎల్సీ ఎడ్యుబోటిక్స్ టెక్నికల్ ఇంజనీర్ పి సురేంద్రబాబు తెలిపారు. రైజ్ క్రిష్ణ సాయి, గాంధీ గ్రూప్స్ ఆఫ్ ఇన్సిస్టిట్యూట్స్ లో గత మూడు రోజులుగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హ్యుమా నాయిడ్ రోబోట్ అను అంశంపై జరుగుతున్న శిక్షణ శనివారం ముగిసింది. కళాశాల కరస్పాండెంట్ శిద్ధా భరత్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా టెక్నికల్ ఇంజనీర్ పి సురేంద్రబాబు మాట్లాడుతూ… రోబోట్లను మెడిసిన్, బయోటెక్నాలజీ, బయో మోకానిక్స్ . కాగ్నటిక్ సైన్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్స్ లో నైపుణ్యం సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పారు. కళాశాల చైర్మన్ ఇస్కాల రంగమన్నారు మాట్లాడుతూ.. విద్యార్థుల ఉపయోగార్థం యాజమాన్యం మంచి కోర్సులలో నైపుణ్యం సాధించే విధంగా శిక్షణ ఇప్పిస్తున్నట్లు చెప్పారు. ఛీప్ అడ్వయిజర్ శిద్ధా ప్రవల్లిక మాట్లాడుతూ మొదటి సారిగా ఇండియాలో ఇంజనీరింగ్ కళాశాలల్లో రోబోటిక్స్ తయారీ అడ్వాన్స్ టెక్నాలజీ శిక్షణను విద్యార్థులకు శిక్షణ ఇప్పించిన ఎకైక సంస్థ రైజ్ క్రిష్ణసాయి, గాంధీ సంస్థలు అని చెప్పారు. విజయవంతంగా పూర్తి చేసిన వారిని అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కెవి సుబ్రమణ్యం, సీఎస్సీ, ఈసీఈ, విభాగపు అధిపతులు ప్రొఫెసర్ పీ ఐజాక్ పాల్, ఎస్వి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు .


