భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు పండుగలా నిర్వహించాలని ఆ పార్టీ అసెంబ్లీ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు కోరారు. దర్శి పట్టణంలో ఆదివారం ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు అత్యుత గురువా రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న సభ్వత్వ నమోదు కార్యక్రమంలో బిజేపి కుటుంబసభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. పట్టణ సభ్యత్వ ఇన్చార్జి నాగభూషణాచారి మాట్లాడుతూ పట్టణంలో ప్రతి వార్డులో ప్రతి బూత్‌లో సభ్యత్వ నమోదు నిర్వహించి పార్టీని బలోపేతం చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో యువమోర్చా నాయకులు చెరుకూరి అనిల్ కుమార్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు వి అమరేశ్వర రావు, మదీనా గౌసాని, అర్హద్ లోకేష్, సీనియర్ నాయకులు అరికట్ల నారాయణ రెడ్డి, కె మురళీ తదితరులు పాల్గొన్నారు.
