తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, శ్రీ హర్షిణి కళాశాల అధినేత గోరంట్ల రవికుమార్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా నిరాశ్రయులైన వరద బాధితులకు భోజనం సదుపాయం కల్పించారు. ఒంగోలులోని శ్రీ హర్షిణి విధ్యా సంస్థల నుండి 2000 మంది వరద బాధితులకు సరిపడా ఆహార పొట్లాలును, మంచినీటి బాటిల్లను విజయవాడ పంపించారు. వరద బాధితులకు మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అవిరళ కృషి చూసి మా వంతుగా వరద బాధితులకు సహకారం అందిస్తున్నామని ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్ తెలిపారు.
