వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్త 105వ జయంతి సందర్భంగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు జరుగుచున్న వాసవి వారోత్సవాల్లో భాగంగా మూడవ రోజు వృద్ధాశ్రమ సేవ నిర్వహించారు.
వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ యూత్ ఒంగోలు వారి సంయుక్త ఆధ్వర్యంలో వారోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి వానిలో భాగంగా స్థానిక సీతారాంపురం సమతా వేదిక మహిళా వృద్ధాశ్రమంలో మాతృమూర్తులకు నిత్యవసర సరుకులను అందించారు.
ఈ సందర్భంగా క్లబ్స్ అధ్యక్షులు నల్లమల్లి బదరి నారాయణ, కూనల శ్రీనివాసరావు మాట్లాడుతూ క్లబ్ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్తా జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వాసవి వారోత్సవాలు సెప్టెంబరు 1 నుండి 7వరకు నిర్వహిస్తుంటామని వానిలో రోజుకు ఒక సామాజిక, సేవ వృద్ధులకు అనాధలకు, స్కూల్స్, కాలేజెస్ లో మోటివేషన్ క్లాసులు గురుపూజోత్సవ దినోత్సవం, పాత్రికేయ దినోత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జి బ్రహ్మానందం పాల్గొన్నారు, దర్శి మనోహర్ చంద్రశేఖర్ నూకల శ్రీనివాసరావు, పబ్బిశెట్టి గోవర్ధన్, అమరా సత్యనారాయణ, క్లబ్ కార్యదర్శులు కె. పవన్ కుమార్, పి. నందకుమార్, కోశాధికారులు డి. పవన్ కుమార్, గుర్రం సునిల్ కుమార్ మరియు భూమా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

