విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తపాలెంలో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన కైపు వెంకటేశ్వరరెడ్డి(జగ్గు)(60) ఉదయం పొలంలో పనులు చేసేందుకు వెళ్లాడు. కాలువ ఒడ్డున విద్యుత్ తీగ ఉండటంతో తీసేందుకు ప్రయ త్నించగా షాక్కు గురై పడిపోయాడు. ఆయన భార్య పక్క పొలంలో ఉన్న రైతులకు తెలపడంతో వారువచ్చి సపర్యలు చేశారు. ఎంతకూ స్పృహ రాకపోవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకె ళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి విద్యుత్ గురై మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వెంకటేశ్వరరెడ్డి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన వెంట జడ్పీ టీసీ మారం వెంకటరెడ్డి, వైసీసీ మండల అధ్యక్షుడు తూము వెంక టసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు మారం ఇంద్రసేనారెడ్డి, మండల కోఆప్ష న్ సభ్యుడు కరిముల్లా, సర్పంచ్ మేకల ఛార్లెస్ సర్జన్ , పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.
ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు కూడా పలువురు నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

