కామారెడ్డి బిసి డిక్లరేషన్ సత్వర అమలు కోసం గత 11 రోజులుగా గాంధీ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న హిందూ బిసి మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ ని, ఏపీ బహుజన్ సమాజ్ పార్టీ కోఆర్డినేటర్, రిటైర్డ్ డీజీపీ
డా పూర్ణచంద్ర రావు పరామర్శించారు. ఈ సందర్భంగా సానుభూతి ప్రకటించి, ఆయన పోరాటానికి మద్దత్తు ప్రకటించారు.
బత్తుల సిద్దేశ్వర్ గత 11 రోజులుగా ఎన్నికలకు వెళ్లే ముందు బీసీలకు 42 శాతం కోటా అమలు చేయాలని, సమగ్ర కుల గణన వెంటనే చెప్పట్టాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు.
గాంధీ దవాఖానలో శ్రీ సిద్దేశ్వర్ నీ కలిసి ఆయనకు సంఘీభావం ప్రకటిస్తూనే, పోరాటాన్ని తీవ్రం చేయటంకోసం ఆయనను నిరాహారదీక్ష విరమించాల్సిందిగా కోరారు. అయన, ప్రభుత్వం నుండి పాజిటివ్ ప్రకటన వచ్చేవరకు దీక్ష విరమించేది లేదు అని సిద్ధేశ్వర్ స్పష్టం చేసారు.
11 రోజులు గా దీక్ష చేస్తున్నా, ప్రభుత్వం స్పందించకపోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇన్నాళ్లు అన్ని ప్రజా ఉద్యమాల్లో ముందు నిలిచి తూటాలను, లాఠీలకు అడ్డునిలిచిన బీసీలు ఇప్పుడు వారి హక్కుల కోసం ఉద్యమిస్తున్నారన్నారు. ఇది తీవ్రతరం అయ్యే విధంగా ఉస్మానియా, సెంట్రల్ యూనివర్సిటీలో త్వరలో ఉద్యమాలు మొదలుకాబోతున్నాయి. ప్రభుత్వానికి మేము ఇదే హెచ్చరిక చేస్తున్నాము, బీసీ హక్కులపై ఎంత కాలయాపన చేస్తే అంత మీకే నష్టం అన్నారు.
బీసీలు తెలంగాణాలో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయారు. 60 శాతం జనాభా నుండి కేవలం 16 శాతం మాత్రమే గత 16 ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లారు. 1741 ఎమ్యెల్యేలలో కేవలం 279 మంది మాత్రమే బీసీలు. అదే రెడ్లు, వెలమలు, చివరికి ఒక జిల్లాకు పరిమితమైన కమ్మవారు అత్యధిక శాతంలో ఉన్నారన్నారు.
బి సి మేధావి ఫోరం కన్వీనర్ చిరంజీవులు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ బి. ఎస్ పి అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్, ఉపాధ్యక్షులు కృష్ణ, మరియు బి సి టైమ్స్ కి చెందిన ఎస్. సూర్యారావు కూడా సిద్ధేశ్వర్ ను పరామర్శించిన వారిలో ఉన్నారు.
