అవగాహన కలిగి ఉంటే అవకాశాలు పొందగలం -మోటివేషనల్ స్పీకర్ కె ఎన్ వి లలిత శ్రీనివాస్ -వాసవి వారోత్సవాలలో బాలికల పాఠశాలలో అవగాహనా సదస్సు.

విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల, సంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, సరైన ప్రణాళికతో ప్రతి సబ్జెక్టు వారీగా పునశ్చరణ చేయడం ద్వారా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతామని, తద్వారా జీవితంలో ఉన్నతమైన స్థానానికి చేరుతామని మోటివేషనల్ స్పీకర్ కే ఎన్ వి లలిత శ్రీనివాస్ విద్యార్థినులకు ఉద్బోధించారు. మాతృభాష పై పట్టు ఉంటేనే ఇతర భాషలను అతి సులువుగా నేర్చుకోగలుగుతామని తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

వాసవి క్లబ్స్ అంతర్జాతీయ సేవా సంస్థ వ్యవస్థాపకులు స్వర్గీయ కల్వకుంట్ల చంద్రసేన గుప్త 105వ జయంతి సందర్భంగా వాసవి క్లబ్స్ సెప్టెంబర్ 1 నుండి 7వ తేదీ వరకు వాసవి వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఒంగోలులోని వాసవి క్లబ్ ఒంగోలు మరియు వాసవి క్లబ్ కే సి జి ఎఫ్ యూత్ ఒంగోలు క్లబ్స్ సంయుక్త నిర్వహణలో వాసవి వారోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు పివిఆర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాల లో బాలికలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సమావేశంలో మోటివేషనల్ స్పీకర్ కే ఎన్ వి లలిత శ్రీనివాస్ అద్భుతమైన ప్రేరేణాత్మక సందేశాన్ని విద్యార్థినులకు అందించారు.

కార్యక్రమంలో వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు నల్లమల్లి బద్రీ నారాయణ, కెసిజిఎఫ్ యూత్ అధ్యక్షులు కూనల శ్రీనివాసరావు, క్లబ్ కార్యదర్శులు పి నందకుమార్ కే పవన్ కుమార్ కోశాధికారులు గుర్రం సునీల్ కుమార్ గోరంట్ల శ్రీనివాసరావు మరియు క్లబ్ జిల్లా అధికారులు పబ్బిశెట్టి వినోద్ కుమార్, గుర్రం రంగనాథ్, చీదెళ్ల వెంకటప్రసాద్, భూమా శ్రీనివాసులు తదితర క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *