సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్విజ్, ఫెస్ ఇంజనీరింగ్ కళాశాలల నుండి సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు లక్ష్మానాయక్ ఆధ్వర్యంలో పదివేల ఆహార పొట్లాలను బుధవారం పంపారు. పేస్ కళాశాల, క్విజ్ కళాశాల ఐదువేల ప్యాకెట్స్ చొప్పున అందజేసారు. ఆయా కళాశాలల బస్సులతో ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేసి సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి లక్ష్మానాయక్ బస్సులను పంపారు. విజయవాడలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యలో బాధితులకు అందించారు.



