రాజ్యాంగ సవరణతోనే వర్గీకరణ సాధ్యం -మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య

ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రపతికి కాని, సుప్రీం కోర్టుకు గాని రాజ్యాంగ సవరణ చేసిన తర్వాతే వర్గీకరణకు వీలు కలుగుతుందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా చెన్నయ్య అన్నారు. అంబేద్కర్ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 341 ప్రకారం బిల్లు పెట్టిన తర్వాతే షేడ్యూల్ కులములను కలుపుకోవటానికి వీలు ఉందని విడగొట్టటానికి ఎటువంటి వీలు లేదని తెలిపారు. ఈనెల 11న వర్గీకరణకు వ్యతిరేక పోరాట సమితి మద్దతుగా బీసీస్పీ అధ్యక్షురాలు మాయావతి, మాజీ ఎంపీ హర్షకుమార్ ఆదేశశాల మేరకు ప్రతిఘటన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒంగోలులో నిర్వహించనున్న ర్యాలీకి ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చెయ్యాలని కోరారు. క్రిమి లేయర్ వలన అన్నదమ్ములుగా కలసి ఉన్న మాల మాదిగలకు ఇద్దరికి అన్యాయం జరగుతుందని ఆన్నారు. జిల్లాలో ఉన్న అన్ని సంఘాలు ఎక త్రాటిపైకి వచ్చి వ్యతిరేక పోరాటాన్ని విజయవంతం చెయ్యాలని కోరారు. నూతనంగా ఒంగోలు పట్టణ అధ్యక్షురాలిగా నామాల షకీలాను ఎంపిక చేసినట్లు చెప్పారు. సంఘ రాష్ట్ర వైస్ ఉపాధ్యక్షుడు బత్తుల వెంకటరావు, రాష్ట్ర సెక్రటరీ బత్తుల సుబ్రమణ్యం, మున్నార్ మహేష్, చలువాది రాజా, ఫిలిఫ్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *