మట్టి విగ్రహాలను పూజించాలి అని మహంకాళీ ఎసిపి సర్దార్ సింగ్ పిలుపునిచ్చారు. గురువారం రాంగోపాల్ పేట్ డివిజన్ సోమసుందరం వీధి లో 500 మట్టి వినాయకులను భక్తులకు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సర్దార్ సింగ్ మాట్లాడుతూ. పూర్వం మట్టి విగ్రహాలనే పూజించేవారని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించే విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేసిన మక్తాల ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు. అనంతరం మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్ మాట్లాడుతూ. ప్రకృతి పరిరక్షణ కోసం మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 సంవత్సరాల నుండి ఉచిత మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నామని, పిఓపి ద్వారా తయారు చేసే విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడడమే గాక జలాశయాలలో ఉండే జలచరులకు కూడా చేటు చేస్తుందని, ఆ జలచరులను తిన్న మనుషులకు కూడా ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు. మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని రక్షించడం మన మానవాళి బాధ్యతగా మక్తాల ఫౌండేషన్ వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహంకాళి ఇన్స్ పేక్టర్ పరశురాం, మార్కెట్ ఇన్స్ పెక్టర్ రాఘవేందర్, విశ్వకర్మ సంఘం అధ్యక్షులు గోపాలపురం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గిర్మాపురం భాస్కర్ చారి, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ మాజీ ధర్మకర్త సదానంద్, వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మాజీ ధర్మకర్త తేజ్ పాల్, ఫౌండేషన్ సభ్యులు సుబ్రహ్మణ్యం, శివ కుమార్ చారీ, శివరతన్, వెంకటేష్, పూర్ణ చందర్, రాజశేఖర్, ప్రకాష్, శ్రవణ్, వాణిశ్రీ, ప్రభు, తదితరులు పాల్గొన్నారు.

