దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ గా నీరజ్ అగర్వాల్………దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరజ్అగ్రవాల్ ఐ.ఆర్.ఎస్.ఈ

దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ (ఏ.జి.ఎం) గా నీరజ్ అగ్రవాల్ సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ సర్వీస్ ఆఫ్ ఇంజనీర్స్ (ఐ.ఆర్.ఎస్.ఈ ) 1987 బ్యాచ్‌కి చెందిన అధికారి. ప్రస్తుత నియామకానికి ముందు, నీరజ్ అగ్రవాల్ దక్షిణ మధ్య రైల్వేలోని, నిర్మాణ విభాగంలో చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేశారు.
మొట్టమొదటగా భారతీయ రైల్వేలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని పశ్చిమ రైల్వేలోప్రారంభించారు. తరువాత నీరజ్ అగ్రవాల్ భారతీయ రైల్వేలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మరియు కె-రైడ్ (కర్ణాటక ప్రభుత్వానికి చెందిన జె. వి.) వంటి కంపెనీలలో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేశారు. దక్షిణ రైల్వే, నైరుతి రైల్వే, తూర్పు మధ్య రైల్వే మరియు దక్షిణ మధ్య రైల్వే వంటి వివిధ జోన్లలో సేవలను కొనసాగించారు. అలహాబాద్ లోని డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్.కు చీఫ్ ప్రాజెక్ట్స్ మేనేజర్ గా న్యూఢిల్లీలోని డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్ కు జనరల్ మేనేజర్ గా, న్యూఢిల్లీలోని ఏం.ఆర్.టి.ఎస్ కు చీఫ్ ఇంజనీర్ గా , తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ లో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా; బెంగళూరులోని కె –రైడ్ కు డైరెక్టర్ గా మరియు నైరుతి రైల్వే కు చీఫ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ గా కీలకమైన పదవులలో భాద్యతలను నిర్వహించారు.
నీరజ్ అగ్రవాల్, అమెరికాలోని ప్రఖ్యాత సంస్థలైన మాక్స్‌వెల్ స్కూల్ ఆఫ్ సిటిజన్‌షిప్ అండ్ పబ్లిక్ అఫైర్స్, సిరక్యూస్, నుండి పబ్లిక్ పాలసీపై అంతర్జాతీయ దృక్పథంపై శిక్షణా కార్యక్రమంలో శిక్షణ పొంది విస్తారమైన పరిపాలనా చతురతను కలిగి ఉన్నారు. గుర్గావ్ ఏం.డి. ఐ నుండి మానవ వనరులలో పనితీరు నైపుణ్యం; ఐ.ఎస్.బి. మొహాలి నుండి ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్; ఐ.పి.ఈ, హైదరాబాద్ నుండి టెండర్లు మరియు ఒప్పందాల వ్యూహాత్మక నిర్వహణ; ఐ. ఐ. టి, ఖరగ్‌పూర్ నుండి శీతాకాలపు కాలంలో హై-స్పీడ్ రైలు వ్యవస్థపై; ఐ. ఎస్. బి. మొహాలి నుండి వ్యూహాత్మక నిర్వహణ మరియు నాయకత్వం; బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్ ద్వారా ప్రజాస్వామ్యంలో భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మెగా ప్రాజెక్ట్-నాయకత్వం; మిలన్,పారిస్, బార్సిలోనాలో డి.ఎఫ్.సి.సి.ఐ.ఎల్ నుండి ఎలక్ట్రికల్ మాడ్యూల్‌పై అంతర్జాతీయ శిక్షణ మరియు ఐ.ఎ. సి.ఎ వియన్నా, ఆస్ట్రియాలో యాంటీ కరప్షన్ & ఎథిక్స్, కెపాసిటీ బిల్డింగ్ మొదలైన ఉత్తమ అభ్యాసాలపై కోర్సులను పూర్తిచేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

నీరజ్ అగ్రవాల్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (సివిల్)ని రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల నుండి పూర్తి చేశారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మాస్టర్స్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీని మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్ట్ మేనేజ్‌మెంట్ నుండి పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *