ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట
ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. హైదరాబాద్ కమీషనర్ శ్రీ.కొత్తకోట శ్రీనివాస రెడ్డి మరియు ట్రాఫిక్ అడిషనల్ సి.పి శ్రీ. విశ్వ ప్రసాద్ గారి ఆదేశాల మేరకు గురువారం తార్నాక లోని ఇరిసెట్ ఉద్యోగులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ మద్యం మత్తులో వాహనం నడిపే ఓ వ్యక్తి బాధ్యతారాహిత్యానికి పాల్పడడంతో అనేక మంది రోడ్డుపై ప్రాణాలు కోల్పోతారు. భారతదేశంలో రోడ్డు ప్రమాదాలపై రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క తాజా నివేదిక ప్రకారం, మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు మూడవ ప్రధాన కారణం, మొదటిది అతివేగం మరియు లేన్ క్రమశిక్షణా రాహిత్యం. డ్రంక్ అండ్ డ్రైవింగ్ సంబంధిత రోడ్డు ప్రమాదాలలో మరణించిన వ్యక్తులు మొత్తం రోడ్డు మరణాలలో 3.5% వాటా కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే మరణాల సంఖ్య పెరిగింది. మరణాల పెరుగుదల ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. 2023 లో హైదరాబాద్‌లో మాత్రమే మొత్తం 37,866 డ్రంకెన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి, ఇందులో 556 లైసెన్సులు రద్దు చేయడం జరిగింది. 3782 మంది జైలుకు వెళ్లారు. 2019 మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం, భారతదేశంలో మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం చట్టవిరుద్ధం మరియు శిక్షార్హమైనది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో డ్రైవింగ్ చేసే వ్యక్తి యొక్క 100 ml రక్తంలో 35 mg కంటే ఎక్కువ ఆల్కహాల్ కనుగొనబడినట్లయితే లేదా వారు వాహనంపై నియంత్రణ సాధించలేనటువంటి డ్రగ్స్ ప్రభావంలో ఉన్నట్లు గుర్తించినట్లయితే అది శిక్షార్హమైన నేరం. వాహనాలు నిర్లక్ష్యముగ నడపటం ఎప్పుడు ప్రమాదకరం అన్నారు. రోడ్డు మీద ఆదమరచి డ్రైవింగ్ చేస్తే ప్రాణాలకు ప్రమాదం. వాహనాలకు భీమా తప్పనిసరిగా చేయించాలి ఈ సంవత్సరం సుమారు 15,500 మంది తాగి వాహనం నడిపిన వారికి, వారి యొక్క కుటుంబ సభ్యుల సమక్షంలో బేగంపేట టిటిఐ నందు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది అని తెలియజేసినారు . ఇట్టి కార్యక్రమములో సుమారు 400 మంది ఇరిసెట్ ఉద్యోగులు , డైరెక్టర్ జనరల్ శ్రీ. శవాద కుమార్ శ్రీవాస్తవ , అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజశేఖర్ మరియు హీరో మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ సేఫ్టీ మేనేజర్ సాదిక్ సాగర్ , హెచ్ జి అబ్దుల్ మాజిద్ పాల్గొన్నారు.

