ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలో సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి వేడుకలను మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరులోని ఎబీసీ ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్రపటానికి ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావు, కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు ఎంఈఓ జి సుబ్బయ్య మాట్లాడుతూ సర్వేపల్లి ప్రతి ఉపాధ్యాయునికి ఆదర్శమని ఆయన జీవిత చరిత్రను గురించి విద్యార్ధులకు వివరించారు. విద్యార్థులు ఉన్నత స్థితికి చేరినట్లయితే ఉపాధ్యాయులకు ఎంతో సంతోషకరంగా ఉంటుందని అన్నారు. ఎంఈఓ-2 సుధాకర్ రావు మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చటంతో ఉపాధ్యాయుల కృషి అమోఘమని అన్నారు. చిన నాటి నుండి తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను గుర్తు చేసుకున్నారు. నిత్యం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయటమే ఉపాధ్యాయుల పాత్ర అని అన్నారు. కరస్పాండెంట్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవటంమే ఉపాధ్యాయులకు ఎంతో ఆనందదాయకమని, అదే వారికి నిజమైన కానుక అని అన్నారు. సర్వేపల్లి రాదా క్రిష్ణన్ విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడిన విధానం ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శ ప్రాయమని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యున్నతికి పాటు పడే ప్రతి ఉపాధ్యాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.
ప్రధానోపాధ్యాయుడు కె. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నేటి ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యతను చెప్పారు. చదువులంటే కేవలం పుస్తకాలలో పాఠ్యాంశాలను చెప్పటం కాదని, సమాజంలోని మంచి చెడులను విద్యార్థులకు చెప్పాల్సిన బాధ్యతను వివరించారు. ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దటంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించాల్సిన అవసరాన్ని వివరించారు. డైరెక్టర్ కాలేషాబాబు మాట్లాడుతూ అజ్ఞానాన్ని పాదద్రోలి విజ్ఞానాన్ని అందిచే వారు ఉపాధ్యాయులని, ఉపాధ్యాయులు నిత్యం నూతన విద్యార్థి వలే జ్ఞానాన్ని సమపార్జిస్తూ ఉన్న నాడే మంచి ఉపాధ్యాయుడుగా విద్యార్థులకు న్యాయం చెయ్యగలుగుతారని చెప్పారు. అనంతరం పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయుల దీవేనలు అందుకున్నారు. ముందుగా ఎంఈఓ జి. సుబ్బయ్య, ఎంఈఓ-2 సుధాకర్ రావులకు పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికారు. సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్ర పటానికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు (ఎస్.ఏ)లు బి. కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి, చిరంజీవి, విక్రమ్ రెడ్డి ,సుష్మిత తదితరులు పాల్గొన్నారు.
తాళ్లూరు ఎంఆర్సి కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు ఎంఈఓ 1 సుబ్బయ్య, ఎం.ఈ.ఓ -2 సుధాకర్ రావు లు ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు.























