పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి వనరులను సంరక్షించుకోవలసిన బాధ్యత దేశ పౌరులుగా మనందరి పై ఉన్నదని కనుక ప్రతి ఒక్కరూ హిందూ సనాతన ధర్మం తెలిపిన ప్రకారం మట్టితో లేక వెండితో లేక బంగారంతో చేసిన వినాయక ప్రతిమను పూజించడం ఎంతో శ్రేయస్కరమని, అటు ప్రకృతి పరంగా ఇటు సంప్రదాయ రీతికి ఉత్తమోత్తమమని శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి, హిందూ ధార్మిక సంస్థ అధ్యక్షులు రాధా రమణ గుప్తా జంధ్యం తెలిపారు. ప్రకృతి ప్రసాదించిన 21 రకాల పత్రితో గణపతి పూజ నిర్వహించడం మన ధరణిని పూజించడమే అని వివరించారు.
సెప్టెంబరు 7వ తేది శ్రీ వినాయక చవితి పర్వదినమును పురస్కరించుకొని “పండుగ చేసుకొందాం – పరమాత్ముని ఆశీస్సులు పొందుదాం” అన్న భావనతో శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటి, ఒంగోలు లోని ఎయిమ్స్ క్లబ్స్ సంయుక్త ఆధ్వర్యములో ఎప్పటి వలెనే మృత్తికా (మట్టి) గణపతి విగ్రహములను ప్రజలకు ఉచితముగా పంపిణి చేస్తున్నామని కనుక సెప్టెంబరు 6వ తేది ఉదయం 9.09 గంటలకు ప్రజలు స్థానిక గాంధీరోడ్డు నందలి శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి దేవస్థానము వద్ద ఏర్పాటు చేస్తున్న పందిరి వద్దకు వచ్చి తీసుకొనవలసినదిగా తెలిపారు.


