ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎసిపి జి శంకర్ రాజు అన్నారు. శుక్రవారం లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలు మరియు నివారణ అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఏసిపి శంకర్ రాజు మాట్లాడుతూ మైనర్లు (18 సంవత్సరాల లోపు పిల్లలు) వాహనాలు నడపరాదని ఆది చట్టరీత్య నేరమని తెలిపినారు. అలా వాహనాలు నడిపినచో తల్లిదండ్రులు మరియు వాహన యజమానికి జైలుశిక్ష పడే అవకాశం ఉంది మరియు 25,000 జరిమానాతో పాటు వాహనం యొక్క రిజిస్ట్రేషన్రద్దు చేయబడుతుంది. రోడ్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా లైన్ వద్ద మాత్రమే క్రాస్ చెయ్యాలి అని తెలియజేసినారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. సిగ్నల్ జంపింగ్ అతి ప్రమాదకరం, ముఖ్యంగా రెడ్ సిగ్నల్ పడినప్పుడు తప్పనిసరిగా వాహనం ఆపాలి. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే జరిమానా మరియు మూడు నెలల జైలు శిక్షను కూడా విధిస్తారు. వాహనం నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పని సరిగా హెల్మెట్ ధరించాలి అని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమములో సుమారు 100 మంది విద్యార్థులు మరియు హెడ్ మాస్టర్ ప్రతాప్ రెడ్డి టిటిఐ బేగంపేట్ సిబ్బంది వెంకటప్రసాద్ పాల్గొన్నారు.


