పౌష్టికాహారంతోనే మెరుగైన సమాజం నిర్మితమౌతుందని సీడీపీఓ సిహెచ్ భారతి అన్నారు. తాళ్లూరు మండలంలో తాళ్లూరు, వెలుగువారి పాలెం గ్రామాలలో శుక్రవారం పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. సీడీపీఓ సిహెచ్ భారతి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సీడీపీఓ మాట్లాడుతూ గర్భిణీగా ఉన్న సమయంలో పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిస్తారని అన్నారు. ఏ ..ఏ ఆరోగ్యం ఎంత మేర తీసుకోవాలి అనే విషయాలను వివరించారు. ఫ్రీ స్కూల్ ప్రాముఖ్యతను తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంను తల్లిదండ్రులు గమనిస్తూ ప్రత్యేక శ్రధ్ధ తీసుకోవాలని కోరారు. సూపర్వైజర్ జ్యోతి మాట్లాడుతూ ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ఏడు నెలల నుండి అనుబంధ ఆహారం మొదలు పెట్టి రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాలని చెప్పారు. బాలా మృతం, కోడి గ్రుడ్లు పిల్లలకు రోజు వారి ఆహారం తప్పనిసరిగా ఇవ్వాలని కోరారు. తాళ్లూరు, వెలుగు వారి పాలెం గ్రామాలలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. పౌష్టికాహార స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వెలుగువారి పాలెం సర్పంచి ఎం. కోటేశ్వరమ్మ ప్రధానోపాధ్యాయులు పెద్ది రెడ్డి, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు నాగ సురేష్, త్రివేణి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.


