సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి
ఆషాడ బోనాల జాతర (2024) భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత అమ్మ వారికి ఐదు వారాల పాటు పప్పు బెల్లాలతో సాక సమర్పించాలని కోరింది.అమ్మ వారి కోరిక ప్రకారం చివరి శుక్రవారము సందర్బముగా శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానంలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి సాకలు సమర్పించారు. ఈ కార్యక్రమములో టిపిసిసి ప్రధాన కార్యదర్శి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డా.కోట నీలిమ , ఆలయ ఈ.ఓ. శ్రీ.గుత్తా మనోహర్ రెడ్డి మాజీ ధర్మకర్తలు, మాజీ ఫెస్టివల్ కమిటి సభ్యులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

