ఆటో ట్రాలీ డ్రైవర్లను బూతులు తిట్టిన బేగంపేట్ ట్రాఫిక్ సిఐ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన నిర్వహించారు.
మినిస్టర్ రోడ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి సమీపంలోని లాజిస్టిక్స్ వద్ద ఆటో ట్రాలీలు పెట్టుకుని పొట్ట పోషించుకుంటున్న ఆటో ట్రాలీ డ్రైవర్ల పై బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాపయ్య అకారణంగా చలాన్లు విధించడమే కాకుండా బూతులు తిట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏ ఐ ఆర్ టి డబ్ల్యు ఎఫ్ , సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే అజయ్ బాబు మాట్లాడుతూ డ్రైవర్లను అకారణంగా దూషించిన ట్రాఫిక్ సీఐ డ్రైవర్లకు క్షమాపణలు చెప్పాలంటూ అజయ్ బాబు డిమాండ్ చేశారు. మినిస్టర్ రోడ్ లో ఆటో ట్రాలీల స్టాండ్ అనుమతి కోసం బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు వరుసగా ఐదు రోజులపాటు వెళ్లిన డ్రైవర్లను ఉదయం సాయంత్రం
తిప్పించుకుంటూ వారి విజ్ఞప్తిని కూడా సీఐ పట్టించుకోలేదని ఇది సరైన చర్య కాదన్నారు. వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నర్సింగ్ అనే డ్రైవర్ నీ సీఐ పాపయ్య దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా అజయ్ బాబు మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనల ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నాయని, ఒకరికొకరు సహకరించుకుంటూ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి కానీ చట్టం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ ట్రాఫిక్ సీఐ వంటి వారు ఇలా డ్రైవర్ల పై ఆధిపత్యం
చెలా యిస్తామంటే సహించేది లేదని ,వారు ఏమి మీ బానిసలు కాదని అజయ్ బాబు హెచ్చరించారు.డ్రైవర్లు 24 గంటలు పాటు సర్వీస్ చేయడం ద్వారా సమాజానికి సేవ చేస్తున్నారని ప్రభుత్వం వేసిన అన్ని పన్నులతో పాటు పోలీసులు ఇస్తున్న అన్ని రకాల చలాన్లు కూడా కడుతూ ఆర్థిక వ్యవస్థను పోషి స్తున్నారని ,వారుంటే
గౌరవం లేకపోయినా, కనీసం చులకనగా చూడటం మానుకోవాలని, సిఐ పాపయ్య వెంటనే డ్రైవర్లకు సారి చెప్పి తప్పు సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు .ఇప్పటికే ఒక వైపు ఆర్టిఏ,మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చలాన్ల పేరుతో డ్రైవర్ల కొద్ది సంపాదన కూడా కొల్లగొడుతున్నారని, డ్రైవర్ల పట్ల పోలీసులు వ్యవహరించే తీరు రవాణా రంగాన్ని సంపాదనకు వనరుగా చూపే తీరుని ప్రభుత్వం మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు .ఈ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకు సంస్కారం నేర్పలేదా, మా వద్దకు రండి మేము నేర్పిస్తాం, డ్రైవర్లంటే మనుషులు కాదా ,మాకు ఆత్మ అభిమానం ఉండదా ,మమ్మల్ని మనుషులుగా చూడండి. అంటూ నినాదాలు చేశారు . బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న సిఐటియూ నాయకులు కార్యకర్తలను బేగంపేట పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎండి కలీం ముఖేష్ అల్లాబక్షు, రవి,
మొయిన్ ,బిక్షపతి ,నర్సింగ్, నాగరాజు ,చారి, తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ లో ఉన్న నేతలను సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఎం .సత్యనారాయణ నగర నాయకులు బి రాజు, ఉమేష్ రెడ్డి ,తదితరులు పరామర్శించి నేతలకు మద్దతు తెలిపారు.


